- పైకి చదవబడే నమాజు (ఫజ్ర్, మఘ్రిబ్ మరియు ఇషా) అయినప్పటికీ ప్రారంభపు దుఆ మౌనంగానే చదువబడుతుంది.
- ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి స్థితిని గురించి – అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చలనంలో ఉన్నా, ఏమీ చేయకుండా ఊరికే ఉన్నా, మౌనంగా ఉన్నా వారి ప్రతి పరిస్థితిని గురించి – తెలుసుకోవాలనే సహాబాల యొక్క శ్రద్ధ, కుతూహలం మనకు కనిపిస్తున్నాయి.
- హదీసు గ్రంథాలలో నమాజు కు సంబంధించి మరికొన్ని ప్రారంభపు దుఆలు నమోదు చేయబడి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమై ఉన్న అటువంటి దుఆలలో ఒక దుఆ ఒకసారి మరొక దుఆ మరొక సారి పఠించుట ఉత్తమం.