/ “మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”...

“మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”...

బురైదహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”

వివరణ

ఈ హదీసులో – ముస్లిములకు మరియు ముస్లిమేతరులకు అంటే అవిశ్వాసులకు మరియు కపటవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు) అని, ఎవరైతే సలాహ్ ను వదిలి వేసినాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు.

Hadeeth benefits

  1. సలాహ్ యొక్క ప్రాముఖ్యత అత్యంత ఉన్నతమైనది మరియు అది విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న భేదము తెలుపుతున్నది.
  2. ఇస్లాం యొక్క ఆదేశాలు మనిషి యొక్క బాహ్య రూపము, ఆచరణల ద్వారా నిరూపితమవుతాయి, అతడి అంతరంగము ద్వారా కాదు.