- సూరతుల్ ఫాతిహా యొక్క అత్యంత గొప్ప ఘనత ఏమిటంటే అల్లాహ్ దానిని ‘సలాహ్’ అని సంబోధించినాడు.
- ఇందులో తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క కరుణ కటాక్షము ఉన్నాయి: ఇందులో అతడు అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తున్నాడు, ఆయనను స్తుతిస్తున్నాడు, ఆయనను పొగుడుతున్నాడు – అల్లాహ్ అతడు అర్థించిన దానిని అతనికి ప్రసాదిస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు.
- అత్యంత ఘనమైన ఈ సూరహ్ లో అల్లాహ్ యొక్క స్తుతి, ఆయనను కీర్తించుట, పునరుత్థాన దినము యొక్క ప్రస్తావన, అల్లాహ్ కు మొరపెట్టుకొనుట, ఆయనకు దుఆ చేయుట, ఆయనను ఆరాధించుటలో నిష్కల్మషత్వము కలిగి ఉండాలనే హితబోధ, ‘సన్మార్గము వైపునకు మార్గదర్శకము’ కొరకు అర్థింపు, అసత్యము మరియు అసత్య మార్గముల పట్ల హెచ్చరిక – ఇవన్నీ ఉన్నాయి.
- ఈ హదీసు ద్వారా సలాహ్ ఆచరించు వ్యక్తికి కలిగే ప్రయోజనం: సూరతుల్ ఫాతిహా పఠనం సలాహ్ లో భయభక్తులను, మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది.