/ “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”...

“మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”...

అమ్ర్ ఇబ్న్ షుఐబ్ రజియల్లాహు అన్హు తన తండ్రి నుండి, ఆయన తన తండ్రి (అమ్ర్ ఇబ్న్ షుఐబ్ తాత) నుండి ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”
దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరిస్తున్నారు: “తన సంతానం – ఆడపిల్లలు మరియు మగ పిల్లలు – ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు, సలాహ్ ఆచరించమని ఆదేశించడం, మరియు వారు సలాహ్ ఆచరించడానికి కావలసిన ఙ్ఞానాన్ని వారికి పొందుపరచడం (ప్రతి) తండ్రి యొక్క విధి. మరియు వారు (సంతానం) పది సంవత్సరాల వయసుకు చేరుకుంటే ఈ విషయం మరింత గంభీరమవుతుంది. అపుడు వారు సలాహ్ ఆచరించుటలో అలసత్వం, సోమరితనం వహిస్తే వారిని దండించాలి; అలాగే ఆడపిల్లల మరియు మగపిల్లల పడకలు వేరు చేయాలి.

Hadeeth benefits

  1. ఈ హదీసు ద్వారా – పిల్లలు యుక్త వయస్సుకు చేరకోకముందే వారికి ధర్మానికి సంబంధించిన విషయాలను బోధించాలని, అందులో సలాహ్ అత్యంత ముఖ్యమైన విషయమని తెలుస్తున్నది.
  2. దండించడం వారిలో క్రమశిక్షణ తీసుకురావడం కొరకు మాత్రమే గానీ హింసించుట కొరకు కాదు అని గమనించాలి. కనుక దండన అనేది పిల్లల స్థితిని బట్టి వారికి తగినదిగా ఉండాలి.
  3. (ధర్మం యొక్క) గౌరవాన్ని, ఘనతను కాపాడటం మరియు వాటిని భంగపరిచడానికి దారితీసే ప్రతి మార్గాన్ని నిరోధించడంలో షరియత్ అన్ని వేళలా శ్రద్ధ చూపుతుంది.