- పాపములు రెండు రకములు, అవి చిన్న పాపములు (అస్’సగాఇర్) మరియుపెద్ద పాపములు (అల్ కబాఇర్) అని తెలుస్తున్నది.
- చిన్న పాపములు పరిహరించ బడుట అనేది, పెద్ద పాపములనుండి దూరంగా ఉండుటపై ఆధారపడి ఉన్నది.
- పెద్ద పాపములు (అల్ కబాఇర్) ఎటువంటివి అంటే వాటికి ఈ ప్రపంచంలో శిక్ష ఉన్నది లేదా తీర్పు దినము నాడు వాటి కొరకు తీవ్రమైన శిక్షను గురించి లేదా అల్లాహ్ యొక్క తీవ్రమైన క్రోధమును గురించి హెచ్చరిక ఉన్నది లేదా వాటికి పాల్బడే వాని కొరకు తీవ్రమైన శాపమును గురించి హెచ్చరిక ఉన్నది, ఉదాహరణకు మద్యపానము, వ్యభిచారము మొదలైనవి.