- పాపాలకు పరిహారంగా పరిణమించే నమాజు (సలాహ్) ఏదంటే – దాసుడు ఉత్తమంగా వుదూ ఆచరించి, వినయము, అనకువలతో, గర్వము లేకుండా, కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే ఆచరించబడే నమాజు.
- ఆరాధనలో నిలకడ కలిగి ఉండటం యొక్క ఘనతను, పుణ్యమును ఇందులో చూడవచ్చు, మరియు అది చిన్న పాపాలు క్షమించబడటానికి కారణం అవుతుంది.
- వుజూ ను ఉత్తమంగా ఆచరించడం, మరియు సలాహ్’ను వినయము, అణకువ కలిగి ఆచరించడం యొక్క ఘనత తెలుస్తున్నది.
- మన ద్వారా జరిగే చిన్న పాపాలు తుడిచివేయబడడానికి పెద్ద పాపాలకు దూరంగా ఉండడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.
- పెద్ద పాపాలు ప్రాయశ్చిత్తముతో తప్ప పరిహరించబడవు.