- ఆచరణల యొక్క ఘనత అల్లాహ్ వాటిని ఇష్టపడే క్రమాన్ని బట్టి ఉంటుంది.
- ఇందులో – ఘనత కలిగిన విషయాలలో ఎక్కువ ఘనత కలిగిన వాటిని ఆచరించుటపై ప్రతి ముస్లిం ఎక్కువ ఆసక్తి చూపాలి అనే హితబోధ ఉన్నది.
- ఉత్తమ ఆచరణలను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధానాలు – వ్యక్తికీ-వ్యక్తికి మధ్య ఉండే శక్తి సామర్థ్యాల తేడాపై, వాటిని గురించి ప్రశ్నించిన వారి స్థితిగతులపై, మరియు వారి కొరకు ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి.