- ప్రతి సలాహ్’కు తాజాగా వుజూ చేయడమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణగా ఉండేది – ఆ విషయములో కూడా సంపూర్ణత సాధించాలనేది వారి కోరిక.
- ప్రతి సలాహ్ కొరకు తాజాగా వుజూ చేయడం అభిలషణీయము.
- అయితే ఒకసారి చేసిన వుజూతో (అది భగ్నం కానంత వరకు) ఒకటి కంటే ఎక్కువ సలాహ్ లు ఆచరించుటకు అనుమతి ఉన్నది.