/ “ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”...

“ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”...

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నాకు ఈ విషయం తెలియజేసినారు: “ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడే వుజూ ముగించి వచ్చిన ఒక వ్యక్తి ని చూసారు. అతడు తన పాదం పై ఒక గోరు అంత పరిమాణం గల భాగాన్ని కడగకుండా వదిలేసాడు. ఆ భాగానికి వుజూ నీరు చేరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతని నిర్లక్ష్యం కారణంగా (నీరు చేరకుండా) ఉండిపోయిన భాగం వైపునకు చూపుతూ అతనితో ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను ఉత్తమంగా ఆచరించి పూర్తి చేయి, ప్రతి భాగానికి దానికి చేరవలసిన నీరు చేరేలా చేయి.” కనుక అతడు తిరిగి వెళ్ళి, (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టుగా) వుజూ పూర్తి చేసి, అప్పుడు నమాజు ఆచరించాడు.

Hadeeth benefits

  1. ఙ్ఞానం లేని వారికి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మంచి పనుల వైపునకు సరైన మార్గదర్శకం చేయడానికి చొరవ తీసుకోవడం తప్పనిసరి; ముఖ్యంగా అతని అజ్ఞానము, నిర్లక్ష్యము కారణంగా కలిగే చెడు అతని ‘ఇబాదత్’ను (ఆరాధనను) లోపభూయిష్టం గావించునది అయితే, అది మరింత తప్పనిసరి అవుతుంది.
  2. వుజూలో నిర్దిష్ట శరీర భాగాలను నీటితో పూర్తిగా కడగడం వాజిబ్ (తప్పనిసరి), మరియు ఎవరైనా ఏదైనా భాగాన్ని వదిలివేస్తే – అది చిన్నది అయినా కూడా - అతని వుజూ సరికాదు, చెల్లదు. వుజూ ముగించిన తరువాత ఎక్కువ సమయం గడిచినట్లయితే, అతను వుజూను పునరావృతం చేయాలి.
  3. వుజూ సక్రమంగా ఆచరించాలి అనడం షరియత్ లోని భాగమే. వుజూను షరియత్ ప్రకారం సరియైన పధ్ధతిలో, సంపూర్ణంగా నిర్వహించాలి.
  4. పాదాలు కడుగుట వుజూలో భాగమే. పాదాలపై తుడిచినట్లుగా చేతిని పారాడించడం సరిపోదు. పాదాలను నీటితో శుభ్రంగా కడగాలి.
  5. వుజూలో కడగవలసిన శరీర భాగాలను (షరియత్ లో) వివరించిన క్రమములోనే కడగాలి. ఒక భాగం ఎండి పోకముందే కడుగ వలసిన తరువాతి భాగాన్ని కడగాలి.
  6. అజ్ఞానం మరియు మతిమరుపు విధి చేయబడిన దానిని తొలిగించదు, బదులుగా విధి చేయబడిన ఆచరణ పాపాన్ని తొలగిస్తుంది. ఈ హదీసులో ఆ వ్యక్తి తెలియనితనం వల్ల వుజూ సక్రమంగా నిర్వహించ లేదు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ విధిగా చేసిన ఆచరణను అతనికి వదిలి వేయలేదు, అదే వుజూ. మళ్ళీ వుజూ చేసి రమ్మని ఆదేశించినారు.