- ఇందులో ఆచరణల విధివిధానాల పట్ల మరియు పరిశుభ్రత పట్ల ఇస్లాం ప్రాధాన్యత వివరించబడింది.
- మలినముల నుండి (మలిన పదార్ధాల నుండి) దూరంగా ఉండాలి, ఒకవేళ వాటిని తప్పనిసరిగా ముట్టుకోవలసిన పరిస్థితి వస్తే ఎడమ చేతిని ఉపయోగించాలి.
- ఇందులో కుడి భాగము (కుడి చేయి, కుడి కాలు, కుడి వైపు మొ.) యొక్క ప్రాధాన్యత, గౌరవము; ఎడమ భాగము పై దాని ఘనత వివరించబడింది.
- అలాగే ఇందులో ఇస్లామీయ షరియత్ యొక్క పరిపూర్ణత మరియు దాని బోధనల సమగ్రత తెలియుచున్నది.