- నీరు దాని రంగు, రుచి మరియు వాసన అనే మూడు లక్షణాలలో, అపరిశుద్ధత కారణంగా ఏదైనా ఒక లక్షణంలో మార్పు వచ్చినట్లయితే ఆ నీరు అపరిశుద్ధమైనదిగా భావించ బడుతుంది. ఈ హదీథు సాధారణంగా చాలా సందర్భాలకు వర్తిస్తుంది, ఏదో ఒక నిర్దుష్ఠమైన సందర్భానికి కాదు.
- ఒకవేళ పరిశుద్ధ వస్తువులు, అపరిశుద్ద పదార్థాల కారణంగా నీరు మార్పునకు లోనైనట్లయితె, అది పూర్తిగానే అపరిశుద్ధమై పోతుంది; ఆ అపరిశుద్ద పదార్థము, లేక ఆ అపరిశుద్ధ వస్తువు కొద్ది మొత్తములో ఉన్నా లేక ఎక్కువ మొత్తములో ఉన్నా సరే. ఈ విషయంపై ఉలమాలందరి ఏకాభిప్రాయం ఉన్నది.