- చనిపోయిన సముద్రపు జంతువుల మాంసము తినుట హలాల్ (అనుమతించబడినది). అయితే సముద్రపు జంతువులు అంటే అవి అందులో తప్ప బయట జీవించలేనివి అని అర్థము.
- ప్రశ్నించిన వ్యక్తికి అతడు అడిగిన దాని కంటే ఎక్కువగా అతనికి వివరించడం ప్రశ్నించే వానికి కలిగే ప్రయోజనాన్ని పరిపూర్ణం చేస్తుంది.
- స్వచ్చమైనది ఏదైనా పడిన కారణంగా నీటి యొక్క రంగు, రుచి, వాసన ఈ మూడింటిలో ఏది మారిపోయినా – ఆ నీరు తన నిజ స్థితిలోనే మిగిలి ఉన్నత్లయితే అది శుద్ధమైన నీటిగానే పరిగణించబడుతుంది. దాని ఉప్పదనం, చల్లదనం లేక దాని వేడిలో పెరుగుదల వచ్చినా సరే.
- సముద్రపు నీరు ‘హద థ్ అల్ అస్గర్’ (చిన్న మాలిన్యము) మరియు ‘హదథ్ అల్ అక్బర్’ వల్ల వ్యక్తి లోనయ్యే అశుద్ధ స్థితిని దూరం చేస్తుంది. అలాగే శుద్ధంగా ఉన్న మనిషి శరీరానికి గానీ, లేక శుద్ధంగా ఉన్న వస్త్రాలకు గానీ అంటిన మాలిన్యాలను కూడా తొలగిస్తుంది.