- ఇందులో ఉదూ సున్నత్ విధానం ప్రకారం ఏ విధంగా చేయాలి, ఉదూ ఆచరణలో ఏఏ విషయాలున్నాయి మొదలైన వాటిని నేర్చుకోవాలనే ప్రొత్సాహం ఉన్నది.
- అలాగే ఇందులో ఉదూ యొక్క ఘనత గురించి తెలుస్తున్నది – ఉదూ చెడుపనులకు, పాపకార్యాలకు పరిహారంగా మారుతుంది అని తెలుస్తున్నది. అయితే ‘కబాయిర్ పాపములు’ అతడి నుంచి దూరం కావు. వాటి కొరకు అతడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడాలి, అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు వేడుకోవాలి.
- ఉదూ చేయు వాని నుండి అతని పాపములు దూరం కావడం కొరకు నియమం ఏమిటంటే,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, అతడు ఆ ఉదూ ను ప్రారంభము నుండి చివరి వరకు ఎటువంటి భంగము, తొందర లేకుండా ఆచరించడం.
- ఈ హదీసులో తెలుపబడిన “పాపములు తొలగిపోవుట” అనే విషయము, ఉదూ చేయు వాడు ‘కబాయిర్’ లనుండి (పెద్ద పాపముల నుండి) దూరంగా ఉండుట అనే దానితో ముడిపడి ఉన్నది. దివ్య ఖుర్’ఆన్’లో అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు:
- “ఒకవేళ మీకు నిషేధించబడినటువంటి మహా పాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవ స్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము. (సూరహ్ అన్’నిసా 4:31)