- ఇందులో ఇస్లాం యొక్క ఘనత మరియు గొప్పతనం తెలుస్తున్నాయి. ఇస్లాంలో రాకకు పూర్వం జరిగిన పాపములను తుడిచివేస్తుంది.
- అలాగే ఇందులో తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క అపారమైన కరుణ, ఆయన క్షమాభిక్ష, మరియు మన్నింపులను గురించి తెలుస్తున్నది.
- అలాగే ఇందులో బహుదైవారాధన హరాం (నిషేధము), (షరియత్ అనుమతించే) కారణము ఏదీ లేకుండా ఎవరినైనా చంపడం హరాం, వ్యభిచారము, అక్రమ లైంగిక సంబంధాలు హరాం అనే విషయాలు, మరియు ఈ పాపములకు పాల్బడే వారికి తీవ్రమైన హెచ్చరిక ఉన్నాయి.
- నిష్కల్మషమైన హృదయముతో చేసినటువంటి, నిజాయితీతో కూడినటువంటి పశ్చాత్తాపము, మరియు ఎక్కువగా సత్కార్యాలు చేయుట అనేది, సర్వోన్నతుడైన అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్బడి ఉన్నప్పటికీ, మరియు అనేక ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) మునిగి ఉన్నప్పటికీ – వాటన్నింటినీ తుడిచివేస్తుంది.
- పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క కరుణ పట్ల నిరాశ చెందుట హరాం అంటే నిషేధము.