- ఇందులో, ఈ ఉమ్మత్ పై (ముస్లిం జాతిపై) అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం తెలుస్తున్నది. ఆయన వద్ద మంచి పనుల ప్రతిఫలం ఎన్నో రెట్లు పెంచి రాయబడుతుంది, చెడు పనులు ఎన్నో రెట్లు పెంచి రాయబడవు (ఉన్నది ఉన్నట్లు గానే రాయబడుతుంది).
- అలాగే ఇందులో, ఆచరణలలో (వాటి వెనుక ఉండే) సంకల్పము యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావము స్పష్టంగా తెలుస్తున్నాయి.
- మహోన్నతుడు, సర్వ శక్తిమంతుడు అయిన అల్లాహ్ యొక్క కరుణ, దయ, దాతృత్వము, కనికరము ఎంత గొప్పవి అంటే కేవలం మంచి పని చేయాలనే స్వచ్ఛమైన సంకల్పము చేసినంత మాత్రమునే, ఆ పని చేయలేక పోయినను, ఆయన తన దాసుని కొరకు అతడు ఆ మంచి పనిని చేసినట్లుగా వ్రాస్తాడు.