- అన్నింటికంటే ముందుగా తెలివిగల వాడు చేయవలసిన పని తాను చేసిన పాపకార్యాలకు, దౌర్జన్యాలకు, అన్యాయాలకు గాను పశ్చాత్తాప పడుట. అంతే గానీ అల్లాహ్ తన ప్రణాళికలో భాగంగా అతడిని వెంటనే శిక్షించకుండా ఉండుట, అతడి వయస్సులో, అతడి సంపదలో వృద్ధి కలిగించుట మొదలైన వాటి వల్ల అతడు ఏమరుపాటుకు గురికారాదు, మోసపోరాదు.
- అల్లాహ్ దుర్మార్గులకు, దౌర్జన్యకారులకు మరింత గడువునిస్తాడు – వారిని వెంటనే శిక్షించడు - వారు పశ్చాత్తప పడుటకు గాను; అలాగే పశ్చాత్తాప పడకుండా వారు మరింతగా పాపపు కార్యాలలో మునిగిపోతే వారిని రెండింతలు శిక్షించుటకుగానూ.
- సమాజాలపై, జాతులపై అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుటకు ముఖ్య కారణాలలో, ఆ జాతులు దుర్మార్గానికి, దౌర్జన్యానికి, అన్యాయాలకు పాల్బడుట కూడా ఒకటి.
- ఒకవేళ ఏదైనా నగరాన్ని అల్లాహ్ నాశనం చేయదలుచుకుంటే, అందులో అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచిన ధర్మపరాయణులు కూడా ఉంటారు. అల్లాహ్ యొక్క శిక్ష అందరిపై వచ్చి పడినప్పటికీ, ఆ శిక్ష వారికి (పరలోకంలో) హాని కలిగించదు. పునరుత్థాన దినమున వారు అన్యాయానికి, అధర్మానికి, దౌర్జన్యానికీ వ్యతిరేకంగా నిలిచి ప్రాణాలను విడిచినందుకు గాను వారు లేపి నిలబెట్టబడతారు.