- మనిషి యొక్క భవిత అతని మరణానంతర జీవితములో స్వర్గము గానీ లేక నరకము గానీ అతని శాశ్వత నివాసం అవుతుంది.
- తీర్పు దినము నాటి భయానక పరిణామం పట్ల ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది. తీర్పు దినము “ఇలా చేయక పోతే బాగుండును” అనే హృదయ విదారకమైన పశ్చాత్తాపము, సిగ్గు పడేలా చేసే దినమై ఉంటుంది.
- ఇందులో, స్వర్గవాసుల కొరకు శాశ్వత సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు ఉంటాయని, నరకవాసుల కొరకు శాశ్వత శిక్షలు, బాధలు, ఉంటాయనే ఉద్బోధ ఉన్నది.