- ప్రజలు ఏమంటారో అనే భయంతో ఎన్నడూ సత్యాన్ని త్యజించరాదు.
- అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గం వైపునకు ప్రజలకు మార్గదర్శకం చేయగలిగే సాక్ష్యాలు, బోధనలు, వివరణలు కలిగి ఉన్నారు, అంతే కానీ వారికి సాఫల్యం ప్రసాదించలేరని తెలుస్తున్నది.
- ఇందులో వ్యాధిగ్రస్తులై ఉన్న అవిశ్వాసులను పలుకరించడానికి, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించడానికి వారిని కలువ వచ్చునని, వారి వద్దకు వెళ్ళవచ్చునని తెలుస్తున్నది.
- అన్ని పరిస్థితులలోనూ ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ చురుకుగా, ఎక్కువ ఆసక్తిగా ఉండేవారని తెలుస్తున్నది.