/ “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంప...

“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంప...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యత్తులో త్వరిత గతిన ఈసా అలైహిస్సలాం భువి నుండి దిగి రావడాన్ని గురించి (అల్లాహ్ పై) ఒట్టు వేసి మరీ ఇలా చెబుతున్నారు – ఆయన (ఈసా అలైహిస్సలాం) ప్రజల మధ్య ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ ప్రకారం న్యాయం చేస్తారు. ఆయన (ఈసా అలైహిస్సలాం) క్రైస్తవులు భక్తిభావనతో గౌరవించే శిలువను విరిచివేస్తారు. మరియు ఈసా (అలైహిస్సలాం) పందిని చంపుతారు. ఆయన అలైహిస్సలాం జిజియాను ఎత్తివేస్తారు, మరియు ప్రజలందరినీ ఇస్లాంలోనికి ప్రవేశించేలా చేస్తారు. మరియు సంపద ప్రవాహం లాగా ఉంటుంది, ఎవరూ దానిని స్వీకరించరు; అలా ఎందుకంటే దాని పుష్కలత కారణంగా. ప్రతి వ్యక్తీ తన చేతులలో ఉన్న దానితో పూర్తి సంతృప్తితో నిండి ఉంటాడు. శుభాలు, ఆశీర్వాదాలు, మేళ్ళు నిరంతరం అవతారిస్తూనే ఉంటాయి.

Hadeeth benefits

  1. ఈ హదీథు ద్వారా (ఈ యుగపు) చివరి దినాలలో ఈసా అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి వస్తారని రుజువు అవుతున్నది. ఆయన దిగిరావడం అనేది ప్రళయ ఘడియను సూచించే చిహ్నాలలో ఒకటి.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ (ప్రళయ ఘడియ వరకు) స్థిరంగా ఉంటుంది. అది దేని చేతనూ రద్ధు చేయబడదు.
  3. ఇందులో – ప్రపంచపు చివరి దినాలలో సంపదలో శుభాలు, ఆశీర్వాదాలు అవతారిస్తూ ఉంటాయని, ప్రజలు సంపద పట్ల ఆసక్తిని కలిగి ఉండరని (దాని నుండి దూరంగా ఉంటారని) తెలుస్తున్నది.
  4. ఇందులో – ఈసా అలైహిస్సలాం ఇస్లాం షరియత్ ప్రకారంగానే పరిపాలిస్తారనే విషయం ద్వారా, మనకు ప్రపంచపు చివరి దినాల వరకూ ఇస్లాం అమరంగా, స్థిరంగా ఉంటుందననే శుభవార్త కనిపిస్తున్నది.