- ఇస్లాం ధర్మము, ఒక శాంతి పూర్వకమైన, కరుణా పూరితమైన ధర్మము; అది సంపూర్ణంగా అల్లాహ్ కు విధేయత చూపుట, మరియు సృష్ఠిలోని సృష్ఠితాలన్నింటిపై కరుణ చూపుట అను విషయాలపై నిలిచి ఉన్నది.
- సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ అనంత కరుణామయుడు అనే గుణలక్షణముతో కీర్తించబడినాడు. పరమ పవిత్రుడైన అల్లాహ్ అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. ఆయనే తన దాసులను కరుణిస్తాడు.
- ప్రతిఫలము ఆచరణలకు తగినట్లుగా ఉంటుంది. కనుక కరుణ చూపే వారిని అల్లాహ్ కరుణించుగాక.