- ‘కరుణ చూపుట’ అనేది భూమిపై జీవించే జీవరాసులన్నింటికీ అవసరమైనదే. కానీ ఇందులో ‘జనులు’ ప్రత్యేకంగా పేర్కొన బడినారు (వారి పై కరుణ చూపడం ప్రత్యేకంగా పేర్కొనబడింది). అది గమనించ వలసిన విషయం.
- అల్లాహ్ అనంత కరుణామయుడు. మరియు కరుణ కలిగి యున్న తన దాసులపై, అతని ఆచరణలను బట్టి ఆయన అతనిపై కరుణ చూపుతాడు.
- ప్రజల పట్ల కరుణ కలిగి ఉండుటలో వారికి మంచి చేయుట, వారి నుండి చెడును, కీడును దూరం చేయుట, వారిని గౌరవించుట, ఆదరించుట మొదలైనవి అన్నీ ఉన్నాయి.