- నిజాయతీ అనేది ఒక గొప్ప లక్షణం, దీనిని నిరంతర సాధన మరియు పోరాటం ద్వారా పొందుతారు, ఎందుకంటే అలాంటి వ్యక్తి నిజాయితీనే కోరుకుంటాడు, నిజాయితీగా ఉండడాన్నే కోరుకుంటాడు, నిజాయితీ అతని స్వభావం మరియు అతని తత్వము అయ్యే వరకు అతని సాధన కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల అతను అల్లాహ్ వద్ద నిజాయితీపరులలో మరియు ధర్మబద్ధులలో నమోదు చేయబడతాడు.
- అసత్యం పలకడం అనేది ఒక ఖండించదగిన మరియు నిందనీయమైన లక్షణం. దానిని కలిగిన వ్యక్తి, సుదీర్ఘ అభ్యాసం ద్వారా దానిని పొందుతాడు. చివరికి అది అతని లక్షణం మరియు స్వభావంగా మారుతుంది. అసత్యం అతని మాటలలో మరియు అతని చర్యలలో భాగమైపోతుంది. చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు
- సత్యసంధత అనేక విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. సత్యసంధత నాలుకతో సంబంధం కలిగి ఉంటుంది, అది అసత్యానికి వ్యతిరేకమై ఉంటుంది; సత్యసంధత సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటుంది, సంకల్పములో సత్యవంతంగా ఉండడం నిజాయితీని సూచిస్తుంది; మంచిని చేయాలనే సంకల్పము దాని పట్ల దృఢత్వానికి, నిబద్ధతకు దారి తీస్తుంది. ఆచరణలలో నిజాయితీ - ఇది తక్కువలో తక్కువగా వ్యక్తి యొక్క అంతర్గత మరియు బాహ్య స్వభావాలలో సరళతకు సత్యవంతంగా ఉండుటకు దారి తీస్తుంది; మరియు వివిధ పరిస్థితులలో సత్యవంతంగా ఉండడం – ఉదాహరణకు భయం, ఆశపడుట మొదలైన విషయాలలో సత్యవంతంగా, నిజాయితీగా ఉండడం. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాడో అతడు అత్యంత సత్యవంతుడు; వీటిలో కొన్ని లక్షణాలు కలిగి ఉన్నవాడు సత్యవాది.