- అన్ని రకాల ‘మంచికి’ మూలము అల్లాహ్ నందు మరియు అంతిమ దినము నందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండుట. అటువంటి విశ్వాసము ‘మంచి’ చేయుటకు ప్రేరణ కలిగిస్తుంది.
- ఇందులో నాలుక వలన కలిగే చెడు, చెరుపు, హాని, నష్టముల గురించి హెచ్చరిక ఉన్నది.
- ఇస్లాం – ఐకమత్యము, ఆత్మీయత, కరుణ మరియు ఔదార్యముల ధర్మము.
- ఈ లక్షణాలు ‘విశ్వాసము’ మరియు కీర్తించదగిన ‘సభ్యత’ యొక్క అనేక శాఖలలో కొన్ని.
- అతిగా మాట్లాడుట అనేది అప్రియమైన విషయాల వైపునకు లేదా నిషేధించబడిన విషయాల వైపునకు దారి తీస్తుంది. కనుక ‘మంచి’ తప్ప మరేమీ మాట్లాడకుండా ఉండుటలోనే సాఫల్యము ఉన్నది.