- ఇందులో పేదలు మరియు బలహీనులు, అక్కరలు గలవారి పట్ల సామరస్యత, సానుభూతి కలిగి ఉండుట, వారికి సహకరించుట మొదలైన మంచి అలవాట్లు అలవర్చుకోవాలనే సందేశం, ప్రోత్సాహం ఉన్నాయి.
- “ఇబాదత్”లో (ఆరాధనలో) మంచి పనులు చేయుట కూడా ఒక భాగము. మరియు ఎవరూ దిక్కు లేని వితంతువుకు మరియు నిరుపేదలకు సహాయం చేయుట, వారి బాగోగులు చూసుకొనుట కూడా ఒక ఇబాదతే (ఆరాధనే).
- ఇబ్నె హుబైరహ్ ఇలా అన్నారు: “ఇందులోని భావం ఏమిటంటే - ఆ వ్యక్తి కొరకు సర్వోన్నతుడైన అల్లాహ్ ఒక ఉపవాసి యొక్క, ఒక ముజాహిద్ యొక్క మరియు ఒక నిరంతరం తహజ్జుద్ పఠించే వాని యొక్క – ఈ ముగ్గురి ప్రతిఫలాలను జమ చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే అతడు వితంతువుకు ఆమె కోల్పోయిన భర్త స్థానములో నిలబడుతున్నాడు, పేదలు, నిరుపేదలు, అక్కరలు గలవారు – తమ అవసరాల కొరకు తామే నిలబడలేని స్థితిలో ఉన్న అసహాయులు, అటువంటి వారికొరకు, అతడు తన శక్తిని ఖర్చు పెడుతున్నాడు, శ్రమించి సంపాదించిన సంపదను ఖర్చు పెడుతున్నాడు, అందుకని అతని ప్రతిఫలం – నిరంతరం ఉపవాసాలు పాటించే వాని ప్రతిఫలానికీ, నిరంతరం తహజ్జుద్ పఠించే వాని ప్రతిఫలానికీ, మరియు అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వాని (శ్రమించిన వాని) ప్రతిఫలానికీ సమానము.