/ “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగ...

“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగ...

అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరూత్థాన దినమున ప్రజలలో ఏ ఒక్కరు కూడా తమ తమ స్థానాల నుండి – వారిని కొన్ని విషయాల గురించి ప్రశ్నించబడే దాకా – స్వర్గం వైపునకు లేదా నరకం వైపునకు ఒక్క అడుగు కూడా కదపలేరు. మొదటిది: అతడి జీవితాన్ని గురించి – అతడు ఎలా గడిపాడు మరియు దేనిలో అంతం చేశాడు? రెండవది: అతడి జ్ఞానాన్ని గురించి – అతడు జ్ఞానాన్ని కేవలం అల్లాహ్ (యొక్క కరుణా కటాక్షాల) కొరకు మాత్రమే ఆర్జించినాడా? ఆర్జించిన జ్ఞానము ప్రకారం ఆచరించినాడా? మరియు ఆ జ్ఞానాన్ని అర్హులకు చేరవేసినాడా? మూడవది: అతడి సంపద గురించి: ఎక్కడినుండి సంపాదించినాడు? అది ధర్మబద్ధంగా ఆర్జించినదా లేక అధర్మంగా ఆర్జించినదా? ఆ సంపదను దేనిపై ఖర్చు చేసినాడు? అల్లాహ్ ఇష్టపడే వాటిపై ఖర్చు చేసినాడా లేక అల్లాహ్ కు అయిష్టమైన వాటిపై ఖర్చు చేసినాడా? నాలుగవది: అతడి శరీరము, శక్తి, ఆరోగ్యము మరియు యవ్వనం గురించి: అతడు వాటిని ఏవిధంగా వినియోగించినాడు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించినాడు?

Hadeeth benefits

  1. సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను సంతోషపెట్టే కార్యాలలో జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇందులో ప్రోత్సాహం ఉంది.
  2. అల్లాహ్ తన దాసులపై కురిపించే శుభాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తన ప్రతి దాసుడిని తాను ప్రసాదించిన శుభాలను గురించి ప్రశ్నిస్తాడు. అందుకని ఆ శుభాలను ప్రతి ఒక్కరూ అల్లాహ్ ఇష్టపడే విషయాలలోనే వినియోగించాలి.