- మానవ ఎముకల నిర్మాణం మరియు వాటి సమగ్రత ప్రతి ఒక్కరిపై సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి, కాబట్టి ఆ ఆశీర్వాదానికి కృతజ్ఞతతో ఉండటానికి ప్రతి ఎముకకు దాని తరపు దానం చేయుట అవసరం.
- ఆ ఆశీర్వాదాల కొనసాగింపు కోసం ప్రతిరోజు మనం కృతజ్ఞత చూపడాన్ని కొనసాగించాలనే ప్రోత్సాహం ఉన్నది.
- అలాగే ఇందులో ప్రతిరోజూ స్వచ్ఛంద ఆరాధనలు (నవాఫిల్) మరియు దాతృత్వ చర్యలను కొనసాగించాలి అని ప్రోత్సహించడం కనిపిస్తుంది.
- ఇందులో ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్య కుదర్చడం అనే ఆచరణ యొక్క ఘనత తెలియుచున్నది.
- అలాగే, ఈ హదీసులో మనిషి తన సహోదరునికి సహాయం చేయాలి అనే హితబోధ ఉన్నది. ఎందుకంటే అతనికి సహాయం చేయడం దానం గా పరిగణించబడుతుంది.
- జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించాలని, అందుకు మస్జిదులకు కాలినడకన వెళ్ళాలని, ఆ విధంగా మస్జిదులను నిండుగా ఉండేలా చేయాలని – ఈ హదీథులో హితబోధ ఉన్నది.
- అలాగే ఈ హదీసులో ముస్లిములు నడిచే కాలిబాటల, రహదారుల నుండి ప్రమాదము కలిగించే మరియు హాని కలిగించే వస్తువులను తొలగించడం ద్వారా వాటిని గౌరవించాలనే ఆదేశం ఉన్నది.