- సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే (ఇతరులపై) ప్రేమను కలిగి ఉండడం అనేది ఎంత ఘనత కలిగిన విషయమంటే, అది ఏ ప్రాపంచిక లాభమూ పొందడానికి అయి ఉండదు (అంటే అందులో ఎలాంటి స్వార్థమూ ఉండదు).
- కనుక కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే, వారికి ఆ ప్రేమను గురించి తెలియ జేయడం అభిలషణీయం – తద్వారా వారి మధ్య ప్రేమ, దగ్గరితనం పెరుగుతుంది.
- విశ్వాసుల మధ్య ప్రేమను విస్తరింప జేయడం విశ్వాసాన్ని, సహోదరత్వాన్ని దృఢపరుస్తుంది మరియు సమాజం విఛ్ఛిన్నం కాకుండా, ముక్కలు ముక్కలుగా విడి పోకుండా కాపాడుతుంది.