- మంచి చేయుట నుండి దూరంగా ఉంచే ప్రవృత్తి ‘అల్ హయా’ అనిపించుకోదు. అది మితిమీరిన సిగ్గు కావచ్చు, అసమర్థత, అసహాయత కావచ్చు లేక పిరికితనం కావచ్చు లేక త్వరగా తేల్చలేని ప్రవృత్తి కావచ్చు.
- అల్లాహ్ కు సంబంధించి ‘అల్ హయా’ అంటే, ఆయన ఆదేశించిన వాటిని ఆచరించడం మరియు ఆయన నిషేధించిన వాటినుండి దూరంగా ఉండడం.
- ప్రజలకు సంబంధించి ‘అల్ హయా’ అంటే వారిని గౌరవించడం, వారికి ఇవ్వవలసిన స్థానమును వారికి ఇవ్వడం, సాధారణంగా ప్రజలు వికారమైనవిగా భావించే వాటి నుండి దూరంగా ఉండడం.