- షరియత్ గ్రంథాలలో విశ్వాసి యొక్క విశ్వాసాన్ని తిరస్కరించడం, ప్రశ్నించడం అనేది హరాం కార్యాలకు పాల్బడడం, లేదా షరియత్ విధిగావించిన ఆచరణలను వదిలివేయుట కారణంగా మాత్రమే.
- ఇందులో శరీరం లోని అంగాలను సంరక్షించుకోవాలనే హితబోధ ఉన్నది – ముఖ్యంగా నాలుకను.
- అల్ సిందీ ఇలా అన్నారు: అపవాది (అపవాదులు మోపేవాడు), మరియు శపించేవాడు అనే పదాలు ఇక్కడ చాలా గంభీరమైన రూపంలో, అతిశయోక్తి రూపంలో చూస్తాము. అయితే ఇందులో ఒక సూచన ఉంది - ఎవరైతే దానికి అర్హులో వారి పట్ల అతిగా కాకుండా కొద్దిగా ‘అపవాదు’ (లాగా అనిపించినా), లేక శాపనార్ధాలైనా వాడినట్లైతే అది విశ్వాసి యొక్క లక్షణానికి హాని కలిగించదు.