- ఈ హదీథులో ఉపవాసం పాటించడం యొక్క ఘనత తెలుస్తున్నది. ఉపవాసం తనను పాటించేవానిని ఇహలోకంలో వాంఛల నుండి, కోరికల నుండి రక్షిస్తుంది మరియు పరలోకంలో నరకాగ్ని శిక్ష నుండి రక్షిస్తుంది.
- ఉపవాసం యొక్క మర్యాదలలో అసభ్యకరమైన మాటలు మరియు పనికిమాలిన మాటలు వదిలివేయడం, ప్రజల హాని మరియు కీడు పట్ల (ఒకవేళ వారు జగడానికి దిగినా, వాదులాటకు దిగినా) ఓపికగా ఉండడం, మరియు వారి పరుష వ్యవహారం, పరుషమైన మాటల పట్ల సహనం వహించడం, మరియు దయతో ప్రతిస్పందించడం ఉన్నాయి.
- ఉపవాసం లేదా ఏదైనా ఇబాదత్ (ఆరాధన) చేసే వ్యక్తి తన ఆరాధనను పూర్తి చేసినందుకు, లేదా దానిని ముగించినందుకు సంతోషపడితే, అది పరలోకంలో అతని ప్రతిఫలాన్ని తగ్గించదు.
- సహనం మరియు ఉపవాసం ఉన్న వారికి లెక్కలేనంతగా వారి ప్రతిఫలం ఇవ్వబడుతుంది, అపుడు వారు అల్లాహ్ ను కలుసుకోవడంలో పూర్తి ఆనందాన్ని పొందుతారు.
- అవసరాన్ని బట్టి మరియు విస్తృత ప్రయోజనం కోసం ప్రజలకు అల్లాహ్ పట్ల తన విధేయతను గురించి తెలియజేయడం కపటత్వంగా (ప్రదర్శనా బుద్ధిగా) భావించబడదు, ఆయనసల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : (నేను ఉపవాసం పాటిస్తున్నాను).
- ఉపవాసం పూర్తి చేసిన వ్యక్తి తన అవయవాలను పాపాల నుండి, నాలుకను అబద్ధం, అశ్లీలత మరియు తప్పుడు మాటల నుండి మరియు కడుపుని ఆహారం మరియు పానీయాల నుండి కాపాడుకుంటాడు.
- ఈ హదీథు ఉపవాసం పాటిస్తున్న సమయంలో, ఉపవాసి పెద్ద గొంతుతో మాట్లాడడం, కలహాలు, గొడవలు, కేకలు వేయడం నిషేధము అని ధృవీకరిస్తున్నది, అయితే ఇవి అన్నీ ఉపవాసం లేని వ్యక్తి కొరకు కూడా నిషేధమే.
- ఈ హదీథ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువు నుండి ఉల్లేఖించిన హదీథులలో ఒకటి, దీనిని ‘అల్ హదీథ్ అల్ ఖుద్సీ’ లేదా ‘దైవప్రేరితమైన హదీథ్’ అంటారు. ‘హదీథ్ అల్ ఖుద్సీ’ యొక్క పదాలు మరియు అర్థము అల్లాహ్ తరఫు నుండి అయి ఉంటాయి. ఇది దైవప్రేరితం అయినప్పటికీ, ఖుర్’ఆన్’ను వేరే ఏ ఇతర గద్యము, వచనము, గ్రంథము నుండి వేరు చేసే ప్రత్యేకతలను హదీథ్ అల్ ఖుద్సీ కలిగి ఉండదు. ఉదాహరణకు ఖుర్’ఆన్ పఠనము అనేది ఒక ఆరాధన (ఇబాదత్); ఖుర్’ఆన్ ను చేతులలోనికి తీసుకుని పఠించుట కొరకు విధిగా వుదూ చేసి ఉండాలి. ఖుర్’ఆన్ ప్రపంచం మొత్తానికి ఒక సవాలు వంటిది; ఖుర్’ఆన్ యొక్క ప్రత్యేకతలలో దాని అద్భుతత్వం కూడా ఒకటి. ఇంకా ఇటువంటి అనేక ప్రత్యేకతలను ఖుర్’ఆన్ కలిగి ఉంది.