- ప్రజల చేతుల్లో ఉండే సంపద నిజానికి అది అల్లాహ్ సంపద. అల్లాహ్ వారిని ఆ సంపదలపై అధికారులుగా (ఖలీఫాలుగా) నియమించాడు, ఆ సంపదలను షరియత్ నియమాలకు లోబడి ఖర్చు చేయుటకుగాను; న్యాయ విరుద్ధంగా మరియు ధర్మ విరుద్ధంగా ఖర్చు చేయుట నుండి దూరంగా ఉండేటందుకు గాను. ఈ సాధారణ నియమం అధికారంలో ఉన్నవారికి, అలాగే సాధారణ ప్రజలకు – అందరికీ సమానంగా వర్తిస్తుంది.
- ఈ హదీసు ద్వారా - ప్రజల వద్ద ఉన్న సంపద విషయంలో షరియత్ యొక్క ఈ కాఠిన్యత, అలాగే ప్రజాధనంపై అధికారిగా నియమించ బడిన వారు, ప్రజల నుండి ధన సేకరణ చేయడం, దానిని ఖర్చు చేయడం మొదలైన విషయాలపై తీర్పు దినము నాడు బాధ్యులుగా నిలబెట్టబడతారు అనే విషయాలు అర్థమవుతున్నాయి.
- ఎవరైతే ధర్మవిరుద్ధంగా తమ సంపదను, ధనాన్ని ఖర్చు చేస్తారో (షరియత్ నిషేధించిన ప్రదేశాలలో, నిషేధించబడిన విషయాలలో ఖర్చు చేస్తారో); అది తమ సంపద కానీ, లేక పరుల సంపద కానీ వారందరూ ఈ హెచ్చరిక పరిధిలోనికే వస్తారు.