/ “ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వది...

“ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వది...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఒక మనిషి ఉండేవాడు. అతడు ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. అతడు తన సేవకునితో ఇలా అనేవాడు ‘నీవు (అప్పులు వసూలు చేసే టప్పుడు) పేదరికంలో ఉన్నవాని దగ్గరకు వెళితే, అతడి అప్పును ఉపేక్షించు. బహుశా అల్లాహ్ మన పాపాలను ఉపేక్షించవచ్చు (చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు). (చనిపోయిన) తరువాత అతడు అల్లాహ్ ను కలిసినపుడు, అల్లాహ్ అతడి పాపాలను ఉపేక్షించి ఉంటాడు".
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో – తరుచూ ప్రజలకు అప్పులు ఇచ్చే వాని గురించి లేదా అరువు మీద ప్రజలకు సరుకులు అమ్మే వాని గురించి తెలియ జేస్తున్నారు. ఆ వ్యక్తి, అప్పులను వసూలు చేయుటకు వెళ్ళే తన సేవకునితో ఇలా అనేవాడు: ‘ఒకవేళ నీవు అప్పు తీసుకున్న వ్యక్తి వద్దకు వెళితే, తాను తీసుకున్న అప్పు తీర్చడానికి అతని వద్ద ఏమీ లేకపోయినట్లయితే, దాని గురించి కఠినంగా అడుగకు, అతడికి ఇంకా సమయం ఇవ్వడం ద్వారా, చూసీ చూడనట్లు వ్యవహరించు’. ‘లేదా (అతడు తీర్చవలసిన అప్పులో) అతడివద్ద ఇవ్వడానికి ఎంత ఉంటుందో అంతే తీసుకో, ఒకవేళ అందులో ఏదైనా లోపం ఉన్నా సరే’. అది అతని ఇచ్ఛ మరియు అల్లాహ్ తనను కూడా చూసీ చూడనట్లు వదిలివేస్తాడని మరియు తన పాపాలను క్షమిస్తాడని ఆశ. అతడు చనిపోయినపుడు అల్లాహ్ అతడిని క్షమించినాడు, అతడి పాపాలను చూసీచూడనట్లు వదిలి వేసినాడు.

Hadeeth benefits

  1. ప్రజలతో జరిపే వ్యవహారాలలో దయాగుణం కలిగి ఉండుట, వారిని క్షమించుట మరియు వారు కష్టాలలో ఉన్నట్లయితే వారితో సంయమనం పాటించుట, ఈ గుణాలు తీర్పు దినము నాడు అల్లాహ్ యొక్క దాసుని ముక్తికి, సాఫల్యానికి దారితీసే గొప్ప కారణాలలో కొన్ని.
  2. అల్లాహ్ యొక్క సృష్టిరాశుల పట్ల (మానవులు, జీవరాశులు మొ.) కరుణ కలిగి ఉండడం మరియు అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో ఉండటం మరియు ఆయన కరుణ పట్ల ఆశ కలిగి ఉండడం మొదలైనవి పాపాలు క్షమించబడడానికి కొన్ని కారణాలు.