పవిత్ర ఖురాన్

Share

{ఓ విశ్వాసులారా! అల్లాహ్ (నియమించిన) చిహ్నాలను[1] మరియు నిషిద్ధ మాసాన్ని[2] ఉల్లంఘించకండి. మరియు బలి పశువులకు మరియు మెడలలో పట్టీ ఉన్న పశువులకు (హాని చేయకండి).[3] మరియు తమ ప్రభువు అనుగ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (కఅబహ్ కు) పోయే వారిని (ఆటంక పరచకండి). కానీ ఇహ్రామ్ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్ హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారి పట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు.} (సూరహ్ అల్-మాఇదహ్ : 2).
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُحِلُّواْ شَعَٰٓئِرَ ٱللَّهِ وَلَا ٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَلَا ٱلۡهَدۡيَ وَلَا ٱلۡقَلَٰٓئِدَ وَلَآ ءَآمِّينَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ يَبۡتَغُونَ فَضۡلٗا مِّن رَّبِّهِمۡ وَرِضۡوَٰنٗاۚ وَإِذَا حَلَلۡتُمۡ فَٱصۡطَادُواْۚ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَـَٔانُ قَوۡمٍ أَن صَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ أَن تَعۡتَدُواْۘ وَتَعَاوَنُواْ عَلَى ٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَلَا تَعَاوَنُواْ عَلَى ٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ
{ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు ఎవరు భయపడాతో చూడటానికి - అల్లాహ్ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.} (సూరహ్ అల్-మాఇదహ్ : 94).
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَيَبۡلُوَنَّكُمُ ٱللَّهُ بِشَيۡءٖ مِّنَ ٱلصَّيۡدِ تَنَالُهُۥٓ أَيۡدِيكُمۡ وَرِمَاحُكُمۡ لِيَعۡلَمَ ٱللَّهُ مَن يَخَافُهُۥ بِٱلۡغَيۡبِۚ فَمَنِ ٱعۡتَدَىٰ بَعۡدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٞ
{ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి.[1] మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.} (సూరహ్ అల్-మాఇదహ్ : 95).
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡتُلُواْ ٱلصَّيۡدَ وَأَنتُمۡ حُرُمٞۚ وَمَن قَتَلَهُۥ مِنكُم مُّتَعَمِّدٗا فَجَزَآءٞ مِّثۡلُ مَا قَتَلَ مِنَ ٱلنَّعَمِ يَحۡكُمُ بِهِۦ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ هَدۡيَۢا بَٰلِغَ ٱلۡكَعۡبَةِ أَوۡ كَفَّٰرَةٞ طَعَامُ مَسَٰكِينَ أَوۡ عَدۡلُ ذَٰلِكَ صِيَامٗا لِّيَذُوقَ وَبَالَ أَمۡرِهِۦۗ عَفَا ٱللَّهُ عَمَّا سَلَفَۚ وَمَنۡ عَادَ فَيَنتَقِمُ ٱللَّهُ مِنۡهُۚ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ
{సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం,[1] జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.} (సూరహ్ అల్-మాఇదహ్ : 96).
أُحِلَّ لَكُمۡ صَيۡدُ ٱلۡبَحۡرِ وَطَعَامُهُۥ مَتَٰعٗا لَّكُمۡ وَلِلسَّيَّارَةِۖ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ ٱلۡبَرِّ مَا دُمۡتُمۡ حُرُمٗاۗ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ إِلَيۡهِ تُحۡشَرُونَ
{అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు.[1] మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.} (సూరహ్ అల్-మాఇదహ్ : 97).
۞ جَعَلَ ٱللَّهُ ٱلۡكَعۡبَةَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ قِيَٰمٗا لِّلنَّاسِ وَٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَٱلۡهَدۡيَ وَٱلۡقَلَٰٓئِدَۚ ذَٰلِكَ لِتَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَأَنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ
{ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు.[1] మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు.} (సూరహ్ అత్-తౌబహ్ : 19).
۞ أَجَعَلۡتُمۡ سِقَايَةَ ٱلۡحَآجِّ وَعِمَارَةَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ كَمَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَجَٰهَدَ فِي سَبِيلِ ٱللَّهِۚ لَا يَسۡتَوُۥنَ عِندَ ٱللَّهِۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ
{మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు:[1] "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.} (సూరహ్ అల్-హజ్ : 27).
وَأَذِّن فِي ٱلنَّاسِ بِٱلۡحَجِّ يَأۡتُوكَ رِجَالٗا وَعَلَىٰ كُلِّ ضَامِرٖ يَأۡتِينَ مِن كُلِّ فَجٍّ عَمِيقٖ
{వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.[1]} (సూరహ్ అల్-హజ్ : 28).
لِّيَشۡهَدُواْ مَنَٰفِعَ لَهُمۡ وَيَذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ فِيٓ أَيَّامٖ مَّعۡلُومَٰتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّنۢ بَهِيمَةِ ٱلۡأَنۡعَٰمِۖ فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡبَآئِسَ ٱلۡفَقِيرَ
{తరువాత వారు హజ్జ్ ఆచారాలు[1] (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.[2]} (సూరహ్ అల్-హజ్ : 29).
ثُمَّ لۡيَقۡضُواْ تَفَثَهُمۡ وَلۡيُوفُواْ نُذُورَهُمۡ وَلۡيَطَّوَّفُواْ بِٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ
{ఒక నిర్ణీత కాలం వరకు మీకు వాటిలో (ఈ పశువులలో) లాభాలున్నాయి.[1] ఆ తరువాత వాటి గమ్యస్థానం ప్రాచీన గృహమే (కఅబహ్ యే)!} (సూరహ్ అల్-హజ్ : 33).
لَكُمۡ فِيهَا مَنَٰفِعُ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى ثُمَّ مَحِلُّهَآ إِلَى ٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ
{ఖుర్బానీ పశువులను,[1] మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలుగా చేశాము; మీకు వాటిలో మేలున్నది. కావున వాటిని (ఖుర్బానీ కొరకు) నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అవి (ప్రాణం విడిచి) ప్రక్కల మీద పడిపోయిన తరువాత మీరు వాటిని తినండి.[2] మరియు యాచించని పేదలకు మరియు యాచించే పేదలకు కూడా తినిపించండి. ఈ విధంగా మేము వాటిని మీకు ఉపయుక్తంగా చేశాము, బహుశా మీరు కృతజ్ఞులవు తారేమోనని.} (సూరహ్ అల్-హజ్ : 36).
وَٱلۡبُدۡنَ جَعَلۡنَٰهَا لَكُم مِّن شَعَٰٓئِرِ ٱللَّهِ لَكُمۡ فِيهَا خَيۡرٞۖ فَٱذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا صَوَآفَّۖ فَإِذَا وَجَبَتۡ جُنُوبُهَا فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡقَانِعَ وَٱلۡمُعۡتَرَّۚ كَذَٰلِكَ سَخَّرۡنَٰهَا لَكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
{వాటి మాంసం గానీ, వాటి రక్తం గానీ అల్లాహ్ కు చేరవు! కానీ మీ భయభక్తులే ఆయనకు చేరుతాయి. మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి, ఈ విధంగా ఆయన వాటిని మీకు వశపరిచాడు. సజ్జనులకు శుభవార్తను వినిపించు!} (సూరహ్ అల్-హజ్ : 37).
لَن يَنَالَ ٱللَّهَ لُحُومُهَا وَلَا دِمَآؤُهَا وَلَٰكِن يَنَالُهُ ٱلتَّقۡوَىٰ مِنكُمۡۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمۡ لِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡۗ وَبَشِّرِ ٱلۡمُحۡسِنِينَ